Monday, June 16, 2014

కర్ణుడు -- మహావీరుడు కానీ మహనీయుడు కాడు..by వనం వెంకట వరప్రసాదరావు గారు

కర్ణుడు. మహావీరుడు కానీ మహనీయుడు కాడు..(Vanam Venkata Varaprasadarao)

' యదిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్' అన్న మహాభారత /ఇతిహాస కథనము గురించి ప్రస్తావిస్తూ మహాభారతంలోని ప్రతి పాత్రకు ఈ ట్రాజిక్ ఫ్లా ఉన్నది. ఎన్నో మంచి గుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం ఆ పాత్రను, ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది అని మానవ చరిత్ర మనకు చెప్తున్నది, ఒక అసూయ అనే గుణాన్ని తీసేస్తే దుర్యోధనుడు ధర్మరజుకంటే , భీముడికంటే ఏమీ తీసిపోడు, అదే గుణం కర్ణుడిలో లేకుంటే అర్జునునికన్నా ఏమీ తీసిపోడు ఎందులోనూ, ఒక్క పరస్త్రీ వ్యామోహం లేకుంటే వీడి ముందు ఎవడూ సరిపోదు అని సాక్షాత్తో ఆంజనేయుడే రావణుడి గురించి అన్నాడు అని నేను అంటే మా క్లాస్ మేట్స్ ఒకటే చప్పట్లు! యిది స్వోత్కర్ష కోసం కాదు, ఆ అంశం భారతీయులకు, వాల్మీకికి, వ్యాసులవారికి కొత్త విషయము కాదు అని చెప్పడం కోసమే అప్పుడు నా భావాలను చెప్పింది, ఇప్పుడు మిత్రులకు చెప్తున్నది కూడా.
దుర్యోధనునికోసం తన సర్వస్వాన్ని అర్పించిన కర్ణుడికి తను చేతున్న దానముల ఫలితం దుర్యోధనునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది అని తెలిసీ ఆ దానాలు చెయ్యడం దుర్యోధనుడిని వంచించడం, తానూ ఆత్మ వంచన చేసుకోవడమే తప్ప మరేమీ కాదు. ఒక ఇతిహాసముగా పరిశీలించినా కేవలం ఒక కవి కల్పనగా పరిగణించినా ఇది సత్యము. అన్నీ ఒక ఎత్తు, యుద్ధం మొదలైతే భీష్ముని మీది కోపంతో, అయన యుద్ధరంగంలో ఉన్నంత కాలం నేను యుద్ధ భూమిలో అడుగుబెట్టాను అని 'సహాయ నిరకరణం' చేయడం మరీ స్వామిద్రోహమే!
వంచనతో విద్యనూ నేర్చుకున్నాడు, అదీ పనికిరాకుండా పోతుంది అన్న విషయము తెలిసీ దుర్యోధనుడిని ఎగేశాడు. ఆ తర్వాత కూడా తన దానముల పరంపరను కొనసాగించాడు, ఆ సహజ కవచ కుండలాలు ఉన్నంత కాలము తను అజేయుడు అని తెలిసికూడా! చివరికి యుద్ధసమయం వచ్చినప్పుడు తోడు లేకుండా పోయాడు దుర్యోధనునికి.
ఉత్తర గోగ్రహణం సమయంలోనూ, చిత్ర రథునితో యుద్ధ సమయంలోనూ దుర్యోధనుని ప్రక్కనే ఉన్న కర్ణుడు అర్జునుని ఏం చేయగలిగాడు? యతో ధర్మస్తతో జయః అదీ కాలము నేర్పిన నీతి.
చివరికి ఒక స్త్రీని నిండు సభలో దుస్తులు లాగేసి అవమానిస్తున్నప్పుడు కూడా వారించలేదు సరికదా, తన తొడ చూపించి దుర్యోధనునికి సైగ చేసి, వాడు తన ఎడమ తొడ చరిచి ద్రౌపదిని వచ్చి కూర్చోమని సైగ చేసి, ఆ తొడ విరిగి యుద్ధభూమిలో పొర్లేదాకా తీసుకొచ్చాడు.
'పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యన్నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః' అన్న ఆ(క)ర్షవాక్యం సమిత్రుడి లక్షణాలను చెప్తుంది. తెలిసీ తెలియక చేతున్న పాపాలను వారించేవాడు, హితమును ఆలోచించేవాడు, తన రహస్యాలను దాచిపెట్టేవాడు, తన మంచి గుణములను అందరికీ తెలియజెప్పి ఆ గుణములను పెంచుక్నేలా ప్రోత్సహించేవాడు, ఆపద వచ్చినప్పుడు వదిలిపెట్టి వెళ్ళని వాడు, అవసర సమయములో తోడు, నీడ, సూచన, సహాయం, ప్రోత్సాహములనిచ్చి ఆదుకునేవాడు... వాడు మిత్రుడు అని మిత్రలక్షణములను చెప్పారు పూర్వీకులు. వీటిలో ఏ ఒక్క లక్షణమూ లేనివాడు కర్ణుడు. మహావీరుడు కానీ మహనీయుడు కాడు.


మూలము

ఈ అంశం మీద జరిగిన ఇతర చర్చల గురించి ఇక్కడ తెలుసుకోండి.

15 comments:

  1. Meeru cheppedhikudaa vakra vakyanameee........... karnudu vanchinchadalachukunte

    rajyanni chepattali , kanesam alanti prayatnam kuda cheyaledhu ...

    Mundhu oka adabiddani siggulekundaa 5 guru ela panchukunnaroo varigurinchi cheppandi..........

    masala vesi chepte Gandhi gurinchi kuda bad ga cheppochu

    ReplyDelete
    Replies
    1. Well said Ajay Krishna..
      Vanam Venkata Varaprasadarao garu.. mee lanti vallu manishi lo chedu nu matrame chustaru.. Manchi tamariki kanabadadu..Karna lost all his sons in the war & lost his life & From the beginning he was left alone.Atta kodallu same to same. 1:5 category !! y r u not talking about them ?? Charitra gurinchi matladetappudu vishayalu poorthiga telusukuni matladandi,..Every one is good & Bad in their own way.. There is nothing either good or bad in this world but thinking make so.... Urs lovingly .. Bhagavat Geeta.
      Thanks for reading..
      Vijay Varma G

      Delete
    2. karnuni gurinche chepearu kada .... pandavulu gurinche chepaandi modhata dhramaraju gurinche..... endukandi ivanii samayam sandarbani batti andaru manchiganu chedaganu kanipistharu. daniki karnunni okkaade ante ela ...

      Delete
    3. @అజయ్ కృష్ణ గారు,
      చెడు చేయడం ఎంత తప్పో , చెడు వెనకాల బలంగా నిలబడడం కూడా అంతే తప్పు.
      చెడును అడ్డుకోకపోవడం కూడా అంతే తప్పు.
      "ధర్మో రక్షతి రక్షిత: " అనే సూత్రానికి కట్టుబడని వారు ఎంత వీరులైనా , శూరులైనా గొప్పవారైనా చివరికి ఓడక తప్పదు. అంతిమాన గెలిచే వారిని విజేత అంటాం కానీ , ఓడిపోయిన వాళ్ళని విజేతలు అనం కదా..??


      ఇకపోతే పంచభర్తృక ద్రౌపది :
      ధర్మం అనేది దేశకాల పరిస్థితులననుసరించి మారుతుంటుంది. బహు భార్యత్వం, బహు భర్తృత్వం ఆనాటి కాలంలో సహజమే.
      మరింత విషయాల కోసం
      """""
      2. ద్రౌపది:

      వేదవ్యాసుడు మహాభారతంలో ద్రౌపది పాత్ర రూపొందించిన తీరు అపురూపం, అనితర సాధ్యం. అసలు ద్రౌపదిలా శీలగుణ సంపన్నతకి సోదాహరణంగా నిలిచే మహిళలు ఏ కాలంలోనైనా అరుదుగానే అగుపిస్తారు. పంచపాండవులకి భార్య అయిన కారణంగా ఆమెని పంచభర్తృకగా చులకన చేసి చూసే ముందు ఆమెపాత్రలోని నిగూఢమైన అంశాలని పరిశీలించడం ఎంతో అవసరం. ఎలాంటి అనూహ్యమైన పరిస్థితులలోనూ, తొణకని భారతీయ గృహిణికి ప్రతిరూపం ద్రౌపది. నిర్భయంగా, నిరహంకారంగా వర్తించే ద్రౌపది సమకాలీన ఫెమినిస్ట్స్‌ని తలపింపజేస్తుంది.

      భర్తలకి భార్య సేవ చేయాలనే నియమం ధర్మంగా పరిగణించిన ద్వాపరయుగంలో జనించిన స్త్రీ ద్రౌపది. అసలు బహు భార్యత్వం, బహుభర్తృత్వం సాధారణమైన సంప్రదాయంగా పరిగణించే ఆ రోజులలో కూడా, ద్రౌపది తన భర్తలతో సహధర్మ చారిణిగా గమించడానికి కూడా స్వతహాగా ఎన్నో నియమాలు విధించుకుంది.
      http://www.prabhanews.com/others/article-85507 """""


      గాంధి:
      మసాలా వేయకుండానే గాంధీ గారి గురించి గాంధీజిని చంపిన గాడ్సే (గాంధే గారి వీరాభిమాని) గురించి , చంపడం వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకోండి.
      " http://www.indiatvnews.com/news/india/know-who-nathuram-godse-was-and-why-he-killed-mahatma-gandhi-33064.html?page=2 "

      Delete
    4. @విజయ్ వర్మ గారు,
      ఏం తెలుసని మీరు వ్యాస కర్తని అంచనా వేసారు..??
      పైన ఆయన పేర్కొన్న విషయం గమనించలేదా..??
      "' యదిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్' అన్న మహాభారత /ఇతిహాస కథనము గురించి ప్రస్తావిస్తూ మహాభారతంలోని ప్రతి పాత్రకు ఈ ట్రాజిక్ ఫ్లా ఉన్నది. ఎన్నో మంచి గుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం ఆ పాత్రను, ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది అని మానవ చరిత్ర మనకు చెప్తున్నది, ఒక అసూయ అనే గుణాన్ని తీసేస్తే దుర్యోధనుడు ధర్మరజుకంటే , భీముడికంటే ఏమీ తీసిపోడు, అదే గుణం కర్ణుడిలో లేకుంటే అర్జునునికన్నా ఏమీ తీసిపోడు ఎందులోనూ, ఒక్క పరస్త్రీ వ్యామోహం లేకుంటే వీడి ముందు ఎవడూ సరిపోదు అని సాక్షాత్తో ఆంజనేయుడే రావణుడి గురించి అన్నాడు "

      అసల 1:5 category అని చులకనగా మాట్లాడారే , మీకు తెలుసా..??
      దేశకాల పరిస్థితుల బట్టి ధర్మం మారుతుంటుందని, ఆ కాలంలో బహు భార్యత్వం, బహు భర్తృత్వం సాధారణం అని..???

      అలా చేయడం మీరన్నంత చులకన పని అయితే పంచ మహా పతివ్రతలలో ద్రౌపదికి స్థానం ఎందుకు ఇస్తారు .??

      యుగాల తరబడి నిలబడే పురాణ పాత్రల ఔచిత్యాల్ని మూడు గంటల వాణిజ్యపరమైన చిత్రాన్ని బట్టి అంచనా వేయడం ఎంత వరకు సమంజసం..?? వ్యాపారం కోసం వారు లక్ష చూపిస్తారు. అన్నీ నమ్మేయడమేనా..?? నిజానిజాల్ని తెలుసుకోవక్కరలేదా..??

      మరిన్ని విషయాల కోసం పైన సమాధానాన్ని కూడా చూడండి
      హరే కృష్ణ

      Delete
  2. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు తన మంచి విషయాలు మరియు చెడు విషయాల గురించి చెప్పాలి. కేవలం చెడు విషయాలు చెప్పడం సరైన పద్ధతి కాదు.

    ReplyDelete
    Replies
    1. @వర్ధన్ గారు ,

      మీరన్నది నిజమే, కాదనట్లేదు. కానీ అపోహలను దూరం చేయడం తెలిసిన వారి కర్తవ్యం .
      మీరే వ్యాసకర్త చెప్పిన విష్యముల గురించి స్పందించారో , అదే విషయాలను మీరు సరిగా పట్టించుకున్నట్లు లేరు.

      "ఎన్నో మంచి గుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం ఆ పాత్రను, ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది అని మానవ చరిత్ర మనకు చెప్తున్నది, ఒక అసూయ అనే గుణాన్ని తీసేస్తే దుర్యోధనుడు ధర్మరజుకంటే , భీముడికంటే ఏమీ తీసిపోడు, అదే గుణం కర్ణుడిలో లేకుంటే అర్జునునికన్నా ఏమీ తీసిపోడు ఎందులోనూ, ఒక్క పరస్త్రీ వ్యామోహం లేకుంటే వీడి ముందు ఎవడూ సరిపోదు అని సాక్షాత్తో ఆంజనేయుడే రావణుడి గురించి అన్నాడు
      "
      మీ కోసం మరో సారి.

      హరేకృష్ణ

      Delete
  3. మీరు అదే చేస్తే, చివరకు మీరు ఏ సంఘటన నుండి ఏ మంచి విషయం తీసుకోలేము

    ReplyDelete
  4. asalu bharyani joodamlo pettadamto poliste, karnudu chesinavi pedda tappulu kadhu.

    ReplyDelete
    Replies
    1. @భువనేష్ గారు
      తప్పులు పెద్దవా చిన్నవా అని కావు, తప్పా కాదా అన్న ఉద్దేశ్యంలోనే పై వ్యాసం సాగింది.. గమనించగలరు.
      చిన్న తప్పైనా పెద్దముప్పుకి దారి తీస్తే అది పెద్ద తప్పు గానే పరిగణింపబడుతుంది అన్న విషయం మీకు తెలియనిది కాదు

      Delete
  5. I need a dislike option for this article... thumbs down...

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదములు @mastero గారు.

      Delete
  6. మరిన్ని విషయాలకు కర్ణుడు - కర్మ ఫలం.
    http://padyalavaidyudu.blogspot.in/2012/11/karmaphalamkarnudu.html

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. కానీ ఇప్పటికి కుడా కర్ణుణ్ణి స్నేహానికి పర్యాయ పదంగా చెబుతారు కదా...

    ReplyDelete