Thursday, October 24, 2013

తల్లి పాల కొరత

తల్లి పాలు పాపాయికి జీవన ఆనవాలు


మా స్నేహితుడు వాళ్ళ చెల్లికి 3 నెలల పసికందు వున్నాడు వాడికి తల్లి పాలు చాలవు, పాల డబ్బా కొంటే నాలుగు వందలు అవుతుందట నాలుగు రోజులు కూడా రావటం లేదు అని వాపోతున్నాడు . ఇది నా స్నేహితుడి చెల్లి సమస్యే కాదు ఎందరో మద్య తరగతి , నిరుపేద తల్లుల సమస్య మాత్రమే కాదు తల్లులందరి సమస్య .

మారుతున్న జీవన విధానమో మరొకటో తెలియదు కాని తల్లి పాలు చాలక చాలా మంది పసికందులు అల్లాడుతున్నారు . పసి పాపలకు తల్లి పాలు చేసే మేలు అంతా ఇంతా కాదు ఆగర్భ శ్రీమంతులు అయినా కటిక పేద అయినా ఈ అదృష్టం భగవంతుడు అందరి పిల్లలకు ఇచ్చాడు. అయితే ఈ అదృష్టాన్ని ఆధునికత పేరు చెప్పి కొందరు, అందం చెడిపోతుందనే అపోహలో మరికొంత మంది తల్లులు కావాలనే పిల్లలకు ఈ అదృష్టాన్ని దూరం చేస్తున్నారు . మరికొంత మంది తల్లులు పోషకాహార లోపం , పేదరికం, అనారోగ్యం , అవగాహన లేమి వంటి కారణాలతో తమ పిల్లలలకు ఎంతో శక్తివంతమయిన తల్లి పాలు ఇవ్వలేకపోతున్నారు .

వీటికి దూరం అయిన పిల్లలు భవిష్యత్ లో ఎన్నో వ్యాదులకు గురి అయ్యే అవకాశం లేకపోలేదు . డబ్బాలు డబ్బాలు కొనలేని సామాన్యులు వేరే గత్యంతరం లేక బయట నానా రకాల కల్తీ పోత పాలు, ప్యాకెట్ పాలుతో తమ పసి పిల్లల కడుపును నింపుతున్నారు. డబ్బా పాలును కూడా సంకించవలసిన పరిస్థితులు .

ఈ సమస్య ఎందరిదో చెప్పలేము . వీటికి పరిష్కారాలు చాలా మంది తల్లులు వారు తీసుకొనే చవుకైన ఆహారం తోనే సాధించవచ్చు పూర్వం పల్లెల్లో వాటిగురించి అవగాహన వుండేది . ఏ ఆహారం తీసుకుంటే తల్లి పాలు సమృద్దిగా ఉంటాయో తెలిసేది, కాని ఇప్పటి తరం వారికి ఆ అవగాహనా అంతగా లేదనే చెప్పాలి . ఎన్ని వేల రూపాయిలు పోసి డబ్బాలు కొన్నా కూడా తల్లి పాలకు సాటి రావు . ఎందరో పిల్లలు తల్లి పాలు లేక ఎన్నో వ్యాదులకు గురై బాదపడుతున్నారు .

మన సమూహంలో ఎంతో మంది వైద్యులు , అనుభవజ్ఞులు , పెద్దలు ఉండవచ్చు వారే కాకుండా అవగాహన వున్న యెవరైనా మీ సూచనలు సలహాలు, సందేహాలు మీ కామెంట్స్ రూపంలో తెలిపి ఈ చర్చను విజయవంతం చేస్తే చాలా మంది తల్లులు, తల్లి కాబోయే యువతులు అవగాహన పెంచుకుంటారు ఇందులో మనం సిగ్గు పడాల్సిన అవసరం ఏమి లేదన్నది మా అభిప్రాయం .

మీగడ త్రినాధ రావు
 
మన తెలుగు మన సంస్కృతి

మూలము 


మరింత సమాచారము కొరకు : సందర్శించండి 


3 comments:

  1. comment by Meenakshi Meenu ::
    thalli palu kosam. . ... morning yekuwa palu,boppayi,carrot juices,,nyt time majjiga annam tinali.nuvvula nunetho chesina vantalu tinadam valla. . .milk production70% untundi.2o% prescriced medicens,10% rest and caring about child will increases the breast milk

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. తల్లిపాల గురించి మరింత అదనపు సమాచారం రామశాంతి గారి బ్లాగ్ పోస్ట్ నుంచి..

    http://ramasanthi.blogspot.in/2008/06/blog-post_21.html

    ReplyDelete