తల్లి పాలు పాపాయికి జీవన ఆనవాలు
మా స్నేహితుడు వాళ్ళ చెల్లికి 3 నెలల పసికందు వున్నాడు వాడికి తల్లి పాలు
చాలవు, పాల డబ్బా కొంటే నాలుగు వందలు అవుతుందట నాలుగు రోజులు కూడా రావటం
లేదు అని వాపోతున్నాడు . ఇది నా స్నేహితుడి చెల్లి సమస్యే కాదు ఎందరో మద్య
తరగతి , నిరుపేద తల్లుల సమస్య మాత్రమే కాదు తల్లులందరి సమస్య .
మారుతున్న జీవన విధానమో మరొకటో తెలియదు కాని తల్లి పాలు చాలక చాలా మంది
పసికందులు అల్లాడుతున్నారు . పసి పాపలకు తల్లి పాలు చేసే మేలు అంతా ఇంతా
కాదు ఆగర్భ శ్రీమంతులు అయినా కటిక పేద అయినా ఈ అదృష్టం భగవంతుడు అందరి
పిల్లలకు ఇచ్చాడు. అయితే ఈ అదృష్టాన్ని ఆధునికత పేరు చెప్పి కొందరు, అందం
చెడిపోతుందనే అపోహలో మరికొంత మంది తల్లులు కావాలనే పిల్లలకు ఈ అదృష్టాన్ని
దూరం చేస్తున్నారు . మరికొంత మంది తల్లులు పోషకాహార లోపం , పేదరికం,
అనారోగ్యం , అవగాహన లేమి వంటి కారణాలతో తమ పిల్లలలకు ఎంతో శక్తివంతమయిన
తల్లి పాలు ఇవ్వలేకపోతున్నారు .
వీటికి దూరం అయిన పిల్లలు భవిష్యత్ లో ఎన్నో వ్యాదులకు గురి అయ్యే అవకాశం
లేకపోలేదు . డబ్బాలు డబ్బాలు కొనలేని సామాన్యులు వేరే గత్యంతరం లేక బయట
నానా రకాల కల్తీ పోత పాలు, ప్యాకెట్ పాలుతో తమ పసి పిల్లల కడుపును
నింపుతున్నారు. డబ్బా పాలును కూడా సంకించవలసిన పరిస్థితులు .
ఈ
సమస్య ఎందరిదో చెప్పలేము . వీటికి పరిష్కారాలు చాలా మంది తల్లులు వారు
తీసుకొనే చవుకైన ఆహారం తోనే సాధించవచ్చు పూర్వం పల్లెల్లో వాటిగురించి
అవగాహన వుండేది . ఏ ఆహారం తీసుకుంటే తల్లి పాలు సమృద్దిగా ఉంటాయో తెలిసేది,
కాని ఇప్పటి తరం వారికి ఆ అవగాహనా అంతగా లేదనే చెప్పాలి . ఎన్ని వేల
రూపాయిలు పోసి డబ్బాలు కొన్నా కూడా తల్లి పాలకు సాటి రావు . ఎందరో పిల్లలు
తల్లి పాలు లేక ఎన్నో వ్యాదులకు గురై బాదపడుతున్నారు .
మన సమూహంలో
ఎంతో మంది వైద్యులు , అనుభవజ్ఞులు , పెద్దలు ఉండవచ్చు వారే కాకుండా
అవగాహన వున్న యెవరైనా మీ సూచనలు సలహాలు, సందేహాలు మీ కామెంట్స్ రూపంలో
తెలిపి ఈ చర్చను విజయవంతం చేస్తే చాలా మంది తల్లులు, తల్లి కాబోయే
యువతులు అవగాహన పెంచుకుంటారు ఇందులో మనం సిగ్గు పడాల్సిన అవసరం ఏమి
లేదన్నది మా అభిప్రాయం .
మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
మూలము
మరింత సమాచారము కొరకు : సందర్శించండి
తల్లి పాలు పాపాయికి జీవన ఆనవాలు
మా స్నేహితుడు వాళ్ళ చెల్లికి 3 నెలల పసికందు వున్నాడు వాడికి తల్లి పాలు చాలవు, పాల డబ్బా కొంటే నాలుగు వందలు అవుతుందట నాలుగు రోజులు కూడా రావటం లేదు అని వాపోతున్నాడు . ఇది నా స్నేహితుడి చెల్లి సమస్యే కాదు ఎందరో మద్య తరగతి , నిరుపేద తల్లుల సమస్య మాత్రమే కాదు తల్లులందరి సమస్య .
మారుతున్న జీవన విధానమో మరొకటో తెలియదు కాని తల్లి పాలు చాలక చాలా మంది పసికందులు అల్లాడుతున్నారు . పసి పాపలకు తల్లి పాలు చేసే మేలు అంతా ఇంతా కాదు ఆగర్భ శ్రీమంతులు అయినా కటిక పేద అయినా ఈ అదృష్టం భగవంతుడు అందరి పిల్లలకు ఇచ్చాడు. అయితే ఈ అదృష్టాన్ని ఆధునికత పేరు చెప్పి కొందరు, అందం చెడిపోతుందనే అపోహలో మరికొంత మంది తల్లులు కావాలనే పిల్లలకు ఈ అదృష్టాన్ని దూరం చేస్తున్నారు . మరికొంత మంది తల్లులు పోషకాహార లోపం , పేదరికం, అనారోగ్యం , అవగాహన లేమి వంటి కారణాలతో తమ పిల్లలలకు ఎంతో శక్తివంతమయిన తల్లి పాలు ఇవ్వలేకపోతున్నారు .
వీటికి దూరం అయిన పిల్లలు భవిష్యత్ లో ఎన్నో వ్యాదులకు గురి అయ్యే అవకాశం లేకపోలేదు . డబ్బాలు డబ్బాలు కొనలేని సామాన్యులు వేరే గత్యంతరం లేక బయట నానా రకాల కల్తీ పోత పాలు, ప్యాకెట్ పాలుతో తమ పసి పిల్లల కడుపును నింపుతున్నారు. డబ్బా పాలును కూడా సంకించవలసిన పరిస్థితులు .
ఈ సమస్య ఎందరిదో చెప్పలేము . వీటికి పరిష్కారాలు చాలా మంది తల్లులు వారు తీసుకొనే చవుకైన ఆహారం తోనే సాధించవచ్చు పూర్వం పల్లెల్లో వాటిగురించి అవగాహన వుండేది . ఏ ఆహారం తీసుకుంటే తల్లి పాలు సమృద్దిగా ఉంటాయో తెలిసేది, కాని ఇప్పటి తరం వారికి ఆ అవగాహనా అంతగా లేదనే చెప్పాలి . ఎన్ని వేల రూపాయిలు పోసి డబ్బాలు కొన్నా కూడా తల్లి పాలకు సాటి రావు . ఎందరో పిల్లలు తల్లి పాలు లేక ఎన్నో వ్యాదులకు గురై బాదపడుతున్నారు .
మన సమూహంలో ఎంతో మంది వైద్యులు , అనుభవజ్ఞులు , పెద్దలు ఉండవచ్చు వారే కాకుండా అవగాహన వున్న యెవరైనా మీ సూచనలు సలహాలు, సందేహాలు మీ కామెంట్స్ రూపంలో తెలిపి ఈ చర్చను విజయవంతం చేస్తే చాలా మంది తల్లులు, తల్లి కాబోయే యువతులు అవగాహన పెంచుకుంటారు ఇందులో మనం సిగ్గు పడాల్సిన అవసరం ఏమి లేదన్నది మా అభిప్రాయం .
మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
మూలము
మరింత సమాచారము కొరకు : సందర్శించండి