"దేశద్రోహులు ,సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు " అనే వారందరికీ విన్నపం.
====================================================
మీరన్నట్టు ఇలాంటి కిరాణా కొట్లు, వ్యాపారాలు, నిర్వహించేవారు అందరూ కోమటోళ్లేనా??
వ్యాపారాన్ని నిర్వహించేవాళ్లలో మంచివాళ్ళు లేరా?? కోమటోళ్లందరూ వ్యాపారాలు చేస్తున్నారా ?? అయినా ఎవడి పని వాడు సక్రమంగా చేస్తున్నారా??
అవినీతి, దోపిడీ కేవలం వ్యాపారానికే పరిమితం అయిందా?? వేరే ఏ రంగం లోనూ అవినీతి లేదా?? మన దేశంలో ఎన్నో వృత్తులున్నాయి. ఒకో వృత్తిని ఆధారంగా చేసుకుని ఒకో కులం మనుగడ సాగించింది , సాగిస్తూ వస్తుంది.
దోపిడీ లేని వృత్తి ఉందా?? అవినీతి ఆవరించని వృత్తి ఉందా??
ఈ ఒక్క ఆలోచన మీ మెదడులో ఉదయిస్తే దోపిడీకి , కులానికి సంబంధం ఆపాదించడం ఎంత తప్పో మీకే తెలుస్తుంది. దయచేసి మీ మెదళ్ల మొదళ్ళలో కూరుకుపోయిన విషాన్ని జనాలపై చిమ్మకండి. సమాజాన్ని ఇంకా భ్రష్టు పట్టించకండి .
నేను దోపిడీ ని సమర్ధించడం లేదు . దోపిడీ చేసి అక్రమంగా ధనార్జన చేసే ప్రతి వ్యాపారి తీరును , ప్రతి మనిషి తీరునూ తప్పు పడుతున్నాను . దోపిడీ చేసే మనిషిని , వృత్తిని అనాలి గానీ ఆ పేరు పెట్టుకుని ఆ కులాన్ని అంతటినీ దేశద్రోహులుగా , స్మగ్లర్లు గా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం?
దమ్ముంటే ఇలాంటి కామెంట్లు చేసే ముందు నీతిపరులైన కులాన్ని చూపించండి ., నీతి అన్నది కులానికి / మతానికి సొత్తు కాదు సోదరులారా... నీతి అన్నది మనిషికి సంబంధించినది .
నాస్తికులారా,
మీరన్నట్టు నీతిని / అవినీతిని ఏ ఒక్క కులానికి అంకితం చేసినా మీరు కొన్ని తరాలుగా వాదిస్తున్న అగ్రవర్ణాలే అర్హులా అన్న వాదనకు మీరు ద్రోహం చేసిన వారవుతారు .
చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి ఛండాలపు పనులు అన్న చందాన మీరు కూడా తయారవుతారు.
ఇలాంటి భావజాలమే తీవ్రవాదానికి దారి తీస్తుంది . విచక్షణ లోపించిన ఏ పనైనా , వాదనైనా వినాశకారి అవుతుంది .
కనుక కాస్త బుర్ర వాడండి . దోపిడీదారులని నిందించండి, దోపిడీని నిరసించండి.
బుర్రలేని వాగుళ్ళు వాగి, చెడు బుద్ధితో తప్పుడు కూతలు కూసే , రాసే వాళ్ళ రాతలు విశ్వసించకండి .
=> దోపిడీని , అవినీతిని ఒక కులానికి అంటగట్టద్దు
--సుష@4U4ever@